ముంబయి: 13 October (H.S.)ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ(Baba Siddique)ని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
బాబా సిద్ధిఖీ శనివారం సాయంత్రం ముంబయిలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. పలువురు దుండగులు అతడిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే ఆయన్ను లీలావతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో అరెస్టయిన హరియాణాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే ఇద్దరు నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్)కు చెందినవారమని పేర్కొన్నట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
---------------
Hindusthan Samachar / Nagaraj Rao